icc: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లీ

  • మొద‌టి స్థానంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు స్టీవ్ స్మిత్‌
  • నాలుగో స్థానానికి ప‌డిపోయిన పుజారా
  • తొలిసారి టాప్-10లో చోటు ద‌క్కించుకున్న దినేశ్ చండీమాల్‌

తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. శ్రీలంక‌తో మూడో టెస్టుకు ముందు ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ 893 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగ‌బాకాడు. మ‌రోవైపు రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు పుజారా నాలుగో స్థానానికి ప‌డిపోయాడు.

ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఇక 743 పాయింట్ల‌తో శ్రీలంక ఆట‌గాడు దినేశ్ చండీమాల్ త‌న కెరీర్‌లో తొలిసారి టాప్ -10లో చోటు ద‌క్కించుకున్నాడు.  భారత ఆటగాళ్లు మురళీ విజయ్ 25వ స్థానంలో, రోహిత్‌ శర్మ 40వ స్థానంలో ఉన్నారు.

ఇక బౌల‌ర్ల జాబితాలో ఇంగ్లండ్ ఆట‌గాడు జేమ్స్ ఆండ‌ర్స‌న్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, భార‌త ఆట‌గాడు రవీంద్ర జడేజా 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో మ‌రో భార‌త ఆట‌గాడు రవిచంద్రన్‌ అశ్విన్ ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జ‌డేజా పూర్వ స్థానంలోనే (2) కొన‌సాగుతున్నాడు. జ‌ట్ల ర్యాంకింగ్‌లో భారత్ 124 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News