youtube: 2017లో ఎక్కువ మంది చూసిన ట్రైలర్స్‌లో రెండో స్థానంలో 'బాహుబలి 2'
- హిందీ వెర్షన్‌కి 80 మిలియన్ల వీక్షణలు
- మొదటి స్థానంలో 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'
- వెల్లడించిన యూట్యూబ్
2017 సంవత్సరంలో ట్రెండ్ అయిన వీడియోలను 'యూట్యూబ్ రీవైండ్' పేరుతో యూట్యూబ్ ప్రకటించింది. అందులో భాగంగా 2017లో ఎక్కువ మంది చూసిన ట్రైలర్లలో 'బాహుబలి 2' చిత్రం రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్ర హిందీ వెర్షన్‌కి 80 మిలియన్లకి పైగా వీక్షణలు వచ్చాయి. మొదటి స్థానంలో 91 మిలియన్ల వీక్షణలతో ఇటీవల విడుదలైన 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' ట్రైలర్ నిలిచింది.
మూడో స్థానంలో 'ఇన్‌క్రెడిబుల్స్ 2 టీజర్' (62 మిలియన్లు), తర్వాత 'థోర్: రాగ్నరాక్' (57 మిలియన్లు), 'టైగర్ జిందా హై' (51 మిలియన్లు) చిత్రాల ట్రైలర్లు ఉన్నాయి. కేవలం అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ అయిన ట్రైలర్ల వీక్షణల ఆధారంగా మాత్రమే ఈ జాబితాను రూపొందించారు. ఇంకా ఈ జాబితాలో 'పద్మావతి' (51 మిలియన్లు), 'థోర్: రాగ్నరాక్' టీజర్ (46 మిలియన్లు), 'ఇట్' (45 మిలియన్లు), 'స్టార్ వార్స్: ద లాస్ట్ జెడై టీజర్' (42 మిలియన్లు), 'పవర్ రేంజర్స్' (39 మిలియన్లు), 'స్టార్ వార్స్: ద లాస్ట్ జెడై' ట్రైలర్ (39 మిలియన్లు), 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీజన్ 7 (39 మిలియన్లు)ల వీడియోలు ఉన్నాయి.