India: తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు: 'భారత్ డ్రోన్' సంఘటనపై చైనా మీడియా

  • ఇటీవ‌లే భార‌త‌ డ్రోన్‌ను కూల్చేసిన చైనా
  • డోక్లాం సమీపంలోకి ప్ర‌వేశించ‌డంతోనే కూలిపోవాల్సి వ‌చ్చింది
  • భారత్ సారీ చెప్పాలి
  • రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు-గ్లోబ‌ల్ టైమ్స్‌

'భార‌త్‌ డ్రోన్‌ను కోల్పోవడమే కాదు.. అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పద'ని చైనా మీడియా మ‌రోసారి భార‌త్‌పై విషం క‌క్కింది. తాజాగా భార‌త్‌కు చెందిన ఓ డ్రోన్‌ను చైనా కూల్చి వేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కూడా చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్‌ టైమ్స్ ఓ క‌థ‌నం రాసుకొచ్చింది. భార‌త డ్రోన్‌ డోక్లాం కొండప్రాంతం సమీపంలోకి ప్ర‌వేశించ‌డంతోనే కూలిపోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది.

అంతేగాక‌, డ్రోన్‌తో త‌మ భూభాగంలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ సారీ చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ఇటువంటి చొర‌బాట్ల‌కు పాల్ప‌డితే డ్రోన్‌ను కోల్పోవడమే కాదని, అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటార‌ని హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. డోక్లాంలో ప్రతిష్టంభన నెల‌కొన్న నేప‌థ్యంలో ఆ భూభాగం విష‌యంలో రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికింది. 

  • Loading...

More Telugu News