Tirumala: తిరుమలలో హోటళ్లకు నోటీసులు... 8 పెద్ద, 13 జనతా హోటళ్లు మూసివేయాలంటూ ఆదేశాలు!

  • నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు
  • జరిమానాలు వేసినా కట్టని యజమానులు
  • తక్షణం మూసివేయాలని నోటీసులు

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 8 పెద్ద హోటళ్లు, 13 జనతా హోటళ్లను మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదేశించారు. బకాయి పడ్డ అద్దెలను చెల్లించకపోవడం, జరిమానాలు కట్టకపోవడం, టెండర్ లో సూచించిన విధంగా కాకుండా, ఇష్టానుసారం ఆహార పదార్థాల ధరలను పెంచడం తదితర కారణాలతో వీటిని మూసివేయాలని నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

తిరుమల హోటళ్లపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం, ఇచ్చిన సూచనలతో ఈ హోటళ్లపై ఒక నెల అద్దెను జరిమానాగా విధించినా, వారు మాత్రం సరిగ్గా స్పందించలేదు. బకాయిలు చెల్లిస్తామని వారి నుంచి నోటి మాట మినహా డబ్బులు వసూలు కాకపోవడంతో మూసివేత నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News