Vistara: నటి జైరా వాసిమ్ ఆవేదనపై స్పందించిన విస్తారా!

  • తననో వ్యక్తి లైంగికంగా వేధించాడన్న జైరా 
  • దర్యాఫ్తు జరుపుతున్నామని ప్రకటించిన విస్తారా
  • ఇటువంటి ప్రవర్తన సహించబోమని వెల్లడి
విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో తన వెనుక కూర్చున్న వ్యక్తి లైంగికంగా వేధించాడని 'దంగల్' నటి జైరా వాసిమ్ కన్నీటితో చెప్పుకోగా, ఆమెకు మద్దతు పెరుగుతున్న వేళ, విస్తారా స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, ఇటువంటి ప్రవర్తనను తాము ఏమాత్రం సహించబోమని పేర్కొంది.

"నిన్న రాత్రి ఒక ప్రయాణికుడితో జైరా వాసిమ్ ఎదుర్కొన్న పరిస్థితి గురించి గమనించాం. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నాం, జైరాకు మద్దతిస్తాం. ఇలాంటి ప్రవర్తనను మేం సహించబోము" అని పేర్కొంది. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో జైరా పెట్టిన పోస్టు వైరల్ అవుతుండగా, ఆమెకు అండగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Vistara
Zaira Wasim
Harrasment

More Telugu News