gujarat assembly election: గుజరాత్ ఎన్నికలు.. పోలింగ్ తర్వాత ఈవీఎంలను మరిచిపోయిన అధికారులు

  • తొలి దశ పోలింగ్ తర్వాత ఘటన
  • జీపులోనే ఈవీఎంలను మర్చిపోయిన అధికారుల
  • షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

గుజరాత్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ప్రధాని మోదీ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలుగా విశ్లేషకులు ఈ ఎలెక్షన్ ను అభివర్ణిస్తున్నారు. మరోవైపు తొలి దశ ఎన్నికల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నర్మద జిల్లాలోని దండిపద నియోజకవర్గంలోని కంజల్ గ్రామంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఓ ప్రైవేట్ జీపులో రాజ్ పిప్లలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఒక యూనిట్ ను జీపులోనే మర్చిపోయారు. మరుసటి రోజు ఉదయం ఈవీఎంలను గుర్తించిన డ్రైవర్ ఆ విషయాన్ని వెంటనే స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆ ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని... అవన్నీ ఖాళీ ఈవీఎంలే అని తెలిపారు. ఏదైనా ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తితే, వెంటనే వినియోగించే నిమిత్తం ఆరు ఈవీఎంలను అదనంగా పంపామని చెప్పారు. ఈ ఆరు ఈవీఎంలలో మూడింటిని అధికారులు మర్చిపోయారని... వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News