Virat Kohli: ఒకరోజు ముందుగానే విరాట్, అనుష్కల వివాహం... కారణమిదే!
- అందరూ అనుకున్న తేదీ మంగళవారం, 12
- 11వ తేదీనే ముగిసిన వివాహం
- వాస్తవ ముహూర్తం 11నే
- ఎవరూ చెప్పకపోవడంతోనే కన్ఫ్యూజన్
మంగళవారం, 12వ తేదీ ఇటలీలోని ఓ రిసార్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మల వివాహం జరుగుతుంది.. గత మూడు రోజులుగా అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ ప్రకటించకున్నా, మీడియా మొత్తం గత పది రోజులుగా కోడై కూసిన విషయమిది. పెళ్లికి పరిమితంగానే ఆహ్వానాలు వెళ్లాయి. రిసెప్షన్ తేదీ కూడా ఫిక్స్ అయింది. క్రికెట్ కు విరాట్ కొద్ది రోజులు సెలవు పెట్టాడు. ఇటలీ వెళ్లిపోయాడు. ఆ వెనుకే అనుష్క, ఇద్దరి బంధువులు ఒకరివెంట ఒకరు చేరిపోయారు. పెళ్లి 12వ తేదీన జరుగుతుందని ఇండియాలో ప్రతి ఒక్కరూ భావిస్తున్న వేళ, అనూహ్యంగా 11వ తేదీనే వారి పెళ్లి జరిగిపోయింది. వారి పెళ్లి చిత్రాలు మీడియాలో వచ్చేంత వరకూ ఏ ఒక్కరికీ పెళ్లి 11నే అన్న ఊహ కూడా రాలేదు. వివాహానికి అతిథులుగా వెళ్లిన వారి నుంచి ఏ మాత్రం ఉప్పందలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
వాస్తవానికి విరాట్, అనుష్కల వివాహ ముహూర్తం 11వ తేదీనే. అయితే, ఈ విషయాన్ని ఎవరూ బయట పెట్టలేదు. ప్రతి ఒక్కరూ 12వ తేదీన పెళ్లని భావించారు. ఈ విషయంలో అటు విరాట్ కానీ, ఇటు అనుష్క కానీ నోరు విప్పకపోవడంతో, పెళ్లి 12న కాదు, 11న అని ఎవరికీ తట్టలేదు. ఆ విధంగా అందరూ ఊహించిన తేదీతో పోలిస్తే, ఒక రోజు ముందుగానే విరుష్క జోడీ వివాహం జరిగినట్టు. ఇక ఓ సెలబ్రిటీ జంటగా, అశేషమైన అభిమానులను కలిగున్న విరాట్, అనుష్కల జోడీ, తమ వివాహాన్ని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారన్నది వారు చెబితేనే తెలుస్తుంది.