ad: ఉదయం 6 గం. నుంచి రాత్రి 10 గం.ల మధ్య కండోమ్ ప్రకటనలు నిషేధం
- ఆదేశించిన కేంద్రం
- ఉత్తర్వులు జారీ చేసిన సమాచార ప్రసారాల శాఖ
- పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని వ్యాఖ్య
కొన్ని వయస్సుల వారికే పరిమితమైన కండోమ్ ప్రకటనలను ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల మధ్య ప్రసారం చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచార ప్రసారాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్న కారణంగా వీటిని రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య మాత్రమే ప్రసారం చేయాలని పేర్కొంది.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994కి సవరణలు చేస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.