roja: పింఛన్ కోసం సీసీ కెమెరాకు తన బాధ చెప్పుకుంటోన్న వృద్ధురాలు... వీడియో పోస్ట్ చేసిన రోజా!
- పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన వృద్ధురాలి ధీనగాథ
- ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేదని ఆవేదన
- విజయనగరం నుంచి విజయవాడ వచ్చిన వృద్ధురాలు
'పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఓ వృద్ధురాలి ధీనగాథ' అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు ఓ స్తంబానికి ఉన్న సీసీ కెమెరా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది. తనకు రావాల్సిన పింఛన్ కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్థానిక నేతలు, అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆ సీసీ టీవీ కెమెరాను చూస్తూ రెండు చేతులూ జోడించి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన బాధను చెప్పుకునే అవకాశం లేకుండా పోతోందని, తాను విజయనగరం నుంచి విజయవాడకు వచ్చానని ఆమె ఆవేదన చెందింది. మీరూ చూడండి..