gold: వరుసగా ఆరో రోజు కూడా పడిపోయిన బంగారం ధర!
- నేడు రూ.180 పడిపోయిన పసిడి ధర
- 10 గ్రాములకు రూ.29,400గా నమోదు
- వెండి ధర కేజీకి రూ.37,775
బులియన్ మార్కెట్లో బంగారం ధర నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరింది. వరుసగా ఆరో రోజు కూడా బంగారం ధర తగ్గింది. ఈ రోజు రూ.180 తగ్గిన పసిడి ధర 10 గ్రాములకు రూ.29,400గా నమోదైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాల కారణంగా బంగారం డిమాండ్ పడిపోతోంది. స్థానిక బంగారం దుకాణదారుల నుంచి కూడా కొనుగోళ్లు పడిపోయాయి.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.29,400గా ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.29,250గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.54 శాతం తగ్గి, ఒక్కో ఔన్స్‌కు 1,241.40 డాలర్లకు చేరింది. మరోవైపు వెండి కూడా రూ.25 తగ్గి, కేజీకి రూ.37,775కి చేరింది.