aadhar: బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
- డిసెంబర్ 31వ తేదీ డెడ్ లైన్
- ఈ డెడ్ లైన్ ను ఉపసంహరించుకున్న కేంద్రం
- కొత్త గడువుపై త్వరలో ప్రకటన
బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31వ తేదీని గతంలో కేంద్రం డెడ్ లైన్ గా విధించింది. తాజాగా ఈ డెడ్ లైన్ ను ఉపసంహరించుకుంది. కొత్త గడువును త్వరలో ప్రకటించనుంది. మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా... మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు ఉంది.