google: 2017లో భారతీయులు గూగుల్‌ని అడిగిన ప్రశ్నలివిగో!
- టాప్ 10 'ఎలా చేయాలి?' ప్రశ్నల జాబితాను వెల్లడించిన గూగుల్
- ఆధార్‌తో పాన్ లింక్ ప్రశ్నకు మొదటి స్థానం
- రెండో స్థానంలో జియో ఫోన్
ఇంటర్నెట్ యుగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే ప్రదేశం గూగుల్. ఎక్కువ మంది ఆశ్రయించేది కూడా ఈ సెర్చింజన్నే. అందులో భాగంగా గతేడాది ట్రెండ్ అయిన ప్రశ్నలను గూగుల్ వెల్లడించింది. భారతీయులు అడిగిన టాప్ 10 'ఎలా చేయాలి?' ప్రశ్నల జాబితాను గూగుల్ ప్రకటించింది. అవేంటో తెలుసా?
- ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ ఎలా లింక్ చేయాలి?
- జియో ఫోన్ ఎలా బుక్ చేయాలి?
- భారత్‌లో బిట్‌కాయిన్ ఎలా కొనాలి?
- స్క్రీన్‌షాట్ ఎలా తీయాలి?
- ముఖం మీది హోలీ రంగును ఎలా తొలగించాలి?
- జీఎస్టీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
- బిట్‌కాయిన్‌ని ఎలా సృష్టించాలి?
- బిగ్‌బాస్ 11లో ఓటు ఎలా వేయాలి?
- భారత్‌లో ఇథీరియం ఎలా కొనాలి? (ఇది కూడా ఒకరకమైన క్రిప్టోకరెన్సీ)