telangan: తెలంగాణలో పేదరికాన్ని పారద్రోలడమే నా లక్ష్యం: గవర్నర్ నరసింహన్
- ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం
- హాజరైన గవర్నర్ నరసింహన్
- పాల్గొన్న ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర
తెలంగాణ రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోలడమే తన లక్ష్యమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మొదటి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు సమాజంలో మార్పులకనుగుణంగా విద్యలో మార్పులు తీసుకురావాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలగలిసిన వ్యవసాయవిద్య వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ హయ్యర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పేరిట ప్రపంచ బ్యాంకు సమర్పిస్తున్న కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తర్వాత గతేడాది విశ్వవిద్యాలయ విజయాలను వైస్ ఛాన్స్‌లర్ వి.ప్రవీణ్ రావ్ అతిథులకు వివరించారు. అలాగే 319 మంది పీజీ, పీహెచ్‌డీ, 790 మంది యూజీ విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు.