Jharkhand: మూత్ర విసర్జనకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన బీజేపీ నేత.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్!

  • పదేళ్ల నాటి కేసులో జైలుకు..
  • ఐసీయూ నుంచి పరారీ
  • ఏడు గంటల తర్వాత తిరిగి ఆసుపత్రికి

జైలు శిక్ష అనుభవిస్తూ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి, జార్ఖండ్ బీజేపీ నేత సమ్రేష్ సింగ్‌ను మూత్ర విసర్జన కోసం ఆసుపత్రి నుంచి బయటకు  పంపిన ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు.

రెండు దశాబ్దాల నాటి కేసులో సోమవారం సమ్రేష్‌ను జిల్లా కోర్టు జైలుకు పంపింది. జైలు డాక్టర్ సూచనతో ఆయనను ధన్‌బాద్‌లోని పాటిల్‌పురా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ (పీఎంసీహెచ్)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాసేపటి తర్వాత సింగ్ కనిపించకుండా పోవడంతో పోలీసుల కళ్లుగప్పి ఆయన తప్పించుకున్నట్టు అనుమానించారు. ఆయన కోసం గాలిస్తుండగానే ఏడు గంటల తర్వాత ఆయన తిరిగి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంతి కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ధన్‌బాద్ ఎస్‌ఎస్‌పీ మనోజ్ చోఠె బీజేపీ నేతకు సెక్యూరిటీగా ఉన్న ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News