gold rate: ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం ధర!
- వరుసగా కొన్ని రోజుల నుంచి పడిపోతూ వస్తోన్న పసిడి ధర
- ఈ రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి రూ.29,665గా నమోదు
- రూ.680 పెరిగి.. రూ.38,280గా నమోదైన కిలో వెండి ధర
వరుసగా కొన్ని రోజుల నుంచి పడిపోతూ వస్తోన్న పసిడి ధర ఈ రోజు కాస్త ఎగిసింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోవడంతో ఈ రోజు పది గ్రాముల బంగారం ధర రూ.230 పెరిగి రూ.29,665గా నమోదయింది. కాగా, వెండి కూడా బంగారం బాటలోనే పయనించి రూ.680 పెరిగి, కిలో వెండి ధర రూ.38,280గా నమోదయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.17శాతం పెరిగి ఔన్సు 1,257.50 డాలర్లుగా నమోదయింది.