america: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాయబార కార్యాలయం.. లండన్‌లో నిర్మించిన అమెరికా
- రూ. 6440 కోట్ల వ్యయం
- డిజైన్ చేసింది ఫిలడెల్ఫియాకు చెందిన కైరన్ టింబర్‌లేక్
- 12 అంతస్తుల భవనంలో 800ల మంది సిబ్బంది
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాయబార కార్యాలయాన్ని అమెరికా నిర్మించింది. లండన్‌లోని థేమ్స్ నదికి దగ్గరలో ఈ కార్యాలయాన్ని నెలకొల్పింది. చూడటానికి ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఈ భవనాన్ని నిర్మించడానికి అక్షరాల రూ. 6440 కోట్లు ఖర్చు చేసింది. దీన్ని ఫిలడెల్ఫియాకు చెందిన కైరన్ టింబర్‌లేక్ డిజైన్ చేశారు.
518 వేల చదరపు అడుగులు, 12 అంతస్తులున్న ఈ భవనంలో 800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఇక్కడి స్ఫటికాల మీద అమెరికా రాజ్యాంగంలోని స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలను చెక్కారు. వ్యర్థజలాలను శుద్ధి చేసి పునర్వినియోగం చేయడం, భవనానికి కావాల్సిన విద్యుత్తు కంటే అధిక సౌరవిద్యుత్తు ఉత్పత్తిచేయడం, అరుదైన మొక్కలతో 12 ఉద్యానవనాలు, వంటి అనేక ప్రత్యేకతలు దీని సొంతం. జనవరి 16, 2018లో దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.