SHARK: 512 ఏళ్లుగా బతికి వున్న షార్క్ చేప... అట్లాంటిక్ సముద్ర జలాల్లో ప్రాచీన షార్క్ గుర్తింపు!
- గ్రీన్ ల్యాండ్ షార్క్ గా గుర్తింపు
- ప్రాథమిక పరిశోధనలో 512 ఏళ్ల వయసుగా నిర్ధారణ
- ఇదే నిజమైతే ఇంత వయసున్న జీవి ఇదే అవుతుంది
మనకు పది తరాల ముందు వారు ఈ భూమ్మీద జీవించి ఉండే అవకాశం లేదు కానీ, వారి కాలానికి సజీవ సాక్షి అయిన ఓ షార్క్ చేప ఇప్పటికీ సముద్ర జలాల్లో ఈత కొడుతూనే ఉంది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఈ గ్రీన్ ల్యాండ్ షార్క్ ను ఓ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది.
18 అడుగుల పొడవు ఉన్న దీనికి 272 నుంచి 512 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని వారు భావిస్తున్నారు. షార్క్ చేప కంటి కణజాలాన్ని పరిశీలించగా ఇది 512 ఏళ్ల క్రితం నాటిదని తెలిసింది. కానీ, దీని కచ్చితమైన వయసును ఇంకా నిర్ధారించలేదు. ఒకవేళ 512 ఏళ్ల క్రితం నాటిదే అని తేలితే ఈ భూగ్రహంపై జీవించి ఉన్న అతి ప్రాచీనమైన జీవి ఇదే అవుతుంది.