rajyasabha: రాజ్యసభలో మొదటిసారి అడుగుపెట్టిన అమిత్ షా!
- ముందు వరుసలో కూర్చున్న బీజేపీ అధ్యక్షుడు
- ప్రధాని మోదీ, అరుణ్ జైట్లీ పక్కనే సీటు
- ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన అమిత్ షా
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమవడంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టారు. ముందు వరుసలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల పక్కన అమిత్ షా కూర్చున్నారు. అమిత్ షా ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రొసీడింగ్స్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు అమిత్ షా లోపలికి వచ్చారు.
ఆయన రాగానే అధికార పక్ష సభ్యులు లేచినిలబడి స్వాగతం పలికారు. మరికొందరు సభ్యులు బల్లలు చరుస్తూ, క్లాప్స్ కొడుతూ ఆహ్వానించారు. వీరందరికీ ఆయన రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వచ్చి, తన స్థానంలో కూర్చున్నారు. ఆ తర్వాత మంత్రులు, కొంతమంది సభ్యులు ఆయన దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అమిత్ షా కూర్చున్న సీటులో ఇంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూర్చునేవారు.