ap cabinet: 2014 పోలీస్యాక్ట్ను ఉపసంహరించుకున్న ఏపీ మంత్రివర్గం.. కాసేపట్లో ఆమోదముద్ర!
- అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ
- ప్రస్తుత డీజీపీ సాంబ శివరావు పదవీకాలాన్ని పొడిగించే అంశంపై చర్చ
- కర్ణాటక తరహాలో ఏపీ ప్రభుత్వమే డీజీపీని నియమించేలా ఆర్డినెన్స్
- రాజధాని, అసెంబ్లీ డిజైన్స్, పోలవరంపై కేబినెట్ లో చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో 2014 పోలీస్యాక్ట్ను ఉపసంహరించుకునే అంశంపై చర్చించారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే విషయంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని పొడిగించే అంశంపై యూపీపీఎస్సీ అంగీకరించని నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం. కర్ణాటక తరహాలో ఏపీ ప్రభుత్వమే డీజీపీని నియమించేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.
అలాగే రాజధాని, అసెంబ్లీ డిజైన్స్ పై కూడా కేబినెట్ చర్చిస్తోంది. టవర్ ఆకృతికి మంత్రివర్గం ఓకే చెప్పనుంది. జనవరి 2 నుంచి 11వరకు జన్మభూమి కార్యక్రమంపై కూడా చర్చిస్తోంది. పోలవరంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.