polavaram: పురందేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డ కంభంపాటి రామ్మోహ‌న్‌ రావు!

  • త‌ప్పుడు లెక్క‌లు చెప్పే అల‌వాటు టీడీపీకి లేదు
  • పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మూడేళ్లుగా అత్యంత నాణ్య‌త‌తో జ‌రుగుతున్నాయి
  • పోల‌వ‌రం 90 శాతం మ‌ట్టిప‌నులు, 40 శాతం కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయి
  • మొత్తానికి ప్రాజెక్టు ప‌నులు 50 శాతం పూర్త‌య్యాయి

ఏపీ ప్ర‌భుత్వం సరైన లెక్కలు పంపితే పోల‌వ‌రం ప్రాజెక్టుకి కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తుందని బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ కంభంపాటి రామ్మోహ‌న్ రావు మండిప‌డ్డారు. త‌ప్పుడు లెక్క‌లు చెప్పే అల‌వాటు టీడీపీకి లేద‌ని ఉద్ఘాటించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మూడేళ్లుగా అత్యంత నాణ్య‌త‌తో జ‌రుగుతున్నాయని చెప్పారు. ఇప్ప‌టికే 90శాతం మ‌ట్టిప‌నులు, 40 శాతం కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయని తెలిపారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మొత్తం 50 శాతం పూర్త‌య్యాయని వివ‌రించారు. అలాగే పోల‌వ‌రం నిర్మించే సామ‌ర్థ్యం రాష్ట్రానికి లేద‌న‌డం అవ‌గాహ‌న రాహిత్యమ‌ని అన్నారు. సామ‌ర్థ్యం లేకుండానే మూడేళ్ల‌లో 50 శాతం ప‌నులు ఎలా పూర్త‌య్యాయని ప్ర‌శ్నించారు.  

  • Loading...

More Telugu News