vizag one day: భారీ స్కోరు కొడుతుందనుకున్న శ్రీలంక కుప్పకూలింది!

  • 215 పరుగులకు కుప్పకూలిన శ్రీలంక 
  • చెరో మూడు వికెట్లు పడగొట్టిన కుల్దీప్, చాహల్
  • వన్డేల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు చేసిన తరంగ

భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత శ్రీలంక భారీ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. ప్రొజెక్టెడ్ స్కోరును కూడా 280 నుంచి 340 వరకు టీవీలో చూపించారు. అప్పటి స్కోరు మూడు వికెట్ల నష్టానికి 160 పరుగులు. ఇంకా 23 ఓవర్లు ఉన్నాయి. అయితే, ఒక్కసారిగా భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.

లంక బ్యాట్స్ మెన్లలో గుణతిలక (13), తరంగ (95), సమరవిక్రమ (42), మ్యాథ్యూస్ (17), డిక్ వెల్లా (8), గుణరత్నే (17), పెరీరా (6), పతిరానా (7), దనంజయ (1), లక్మల్ (1) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహల్ లు చెరో మూడు వికెట్లు తీయగా పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు చెరో వికెట్ తీశారు. మరోవైపు ఉపుల్ తరంగా ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగుల (1003) క్లబ్బులో చేరాడు. తొలి స్థానంలో కోహ్లీ (1460), రెండో స్థానంలో రోహిత్ శర్మ (1286)లు ఉన్నారు.

215 పరుగుల ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తే ఈ సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఫుల్ ఫామ్ లో ఉన్న టీమిండియా బ్యాట్స్ మెన్ కు ఈ టార్గెట్ ఓ లెక్క కాకపోవచ్చు. 

  • Loading...

More Telugu News