BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే... అత్యధిక స్థానాల్లో దూసుకెళుతున్న బీజేపీ!
- వంద స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యం
- 65 చోట్లకే పరిమితమైన కాంగ్రెస్
- హిమాచల్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ
ఇప్పటివరకూ అందుతున్న ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే గుజరాత్ లో బీజేపీ 110 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ లో పూర్తి మెజారిటీ ఖాయమని తెలుస్తోంది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థితో పోలిస్తే, 4 వేల ఓట్లకు పైగా మెజారిటీలో ఉన్నారు. నార్త్ గుజరాత్ లో బీజేపీ అభ్యర్థి బయద్, మెహసనాలో డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్, బీజేపీ చీఫ్ జిత్తూ వఘానీ, మరో ప్రముఖ నేత శక్తి సింగ్ గోయల్ ముందంజలో ఉన్నారు.
కాగా, గుజరాత్ సెంట్రల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ముందడుగు వేశారు. 182 స్థానాలున్న గుజరాత్ లో 172 స్థానాల సరళి వెలువడుతుండగా, బీజేపీ 105, కాంగ్రెస్ 65, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 16, కాంగ్రెస్ 9 చోట్ల ముందంజలో వున్నాయి.