ram gopal varma: రామ్గోపాల్ వర్మని వెంటనే అరెస్టు చేయాలి.. లేదంటే కోర్టుకు వెళతాం: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- 'కడప' పేరిట వెబ్ సిరీస్ ప్రారంభించిన వర్మ
- రక్తపుటేరులను గురించి చూపిస్తోన్న వివాదాస్పద దర్శకుడు
- రాయలసీమ విమోచన సమితి నాయకుల అభ్యంతరం
- అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
'కడప' పేరిట వెబ్ సిరీస్ ప్రారంభించిన వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆ ప్రాంత ఫ్యాక్షన్ రాజకీయాల గురించి, గొడవలు, రక్తపుటేరులను గురించి చూపిస్తూ మచ్చుకి ఒక వీడియోను వదిలారు. కడపలో విద్వేషాలు మరింత రేపేలా ఈ వీడియో ఉండడంతో రాయలసీమ విమోచన సమితి నాయకులు అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్మ చూపిన ట్రైలర్లో కడపలోనే హింస పుట్టినట్టుగా చూపారని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రామ్గోపాల్ వర్మని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈ విషయమై న్యాయస్థానంలో పిల్ దాఖలు చేస్తామని చెప్పారు.