nitin gadkari: ఈవీఎంలు సరిగా లేవనడం సరికాదు: కేంద్ర మంత్రి గడ్కరీ
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు
- అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
- ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే 92 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని సంపాదించిన భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తమ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు సరిగా లేవనడం సరికాదని అన్నారు.
అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని చెప్పారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని హితవు పలికారు.