stock markets: గుజరాత్ ఫలితాల ఎఫెక్ట్.. కుప్పకూలి, చివరకు కోలుకున్న మార్కెట్లు!
- స్టాక్ మార్కెట్లకై తీవ్ర ప్రభావం చూపిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు
- ఒకానొక సమయంలో 700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- చివరకు 139 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రారంభంలో బీజేపీకి వ్యతిరేకంగా ట్రెండ్స్ రావడంలో మార్కెట్లు కుప్పకూలాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 700 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత బీజేపీ లీడ్ లోకి రావడంతో నెమ్మదిగా పుంజుకుని 300 పాయింట్లకు పైగా లాభాల్లోకి వచ్చింది. చివర్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో 139 పాయింట్ల లాభానికి పరిమితమై 33,602 వద్ద ముగిసింది. నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 10,389కి పెరిగింది.
బీఎస్సీ సెన్సెక్స్ లో ఇవాల్టి టాప్ గెయినర్లు:
టీటీకే ప్రిస్టేజ్ (8.96%), పేజ్ ఇండస్ట్రీస్ (8.59%), ఇంటెలెక్ట్ డిజైన్ (8.49%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (6.45%), సింఫనీ (5.74%).
టాప్ లూజర్స్:
జై ప్రకాశ్ అసోసియేట్స్ (-3.13%), జైన్ ఇరిగేషన్ (-2.85%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-2.22%), బలరామ్ పూర్ చిన్ని మిల్స్ (-2.04%), మంగళూరు రిఫైనరీస్ (-2.03%).