kim jong un: ప్రపంచాన్ని వణికించిన 'వాన్నాక్రై' వెనుక ఉన్నది కిమ్ జాంగ్ హస్తమేనట!

  • ఉత్తర కోరియా హస్తం ఉందన్న అమెరికా
  • బలమైన సాక్షాలు ఉన్నాయంటూ ప్రకటన
  • వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం

ప్రపంచం మొత్తాన్ని వణికించిన 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ కు సంబంధించి అమెరికా సంచలన ఆరోపణ చేసింది. ఈ ర్యాన్సమ్ వేర్ వెనుక ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉందంటూ గతంలో పరోక్ష విమర్శలు చేసిన అమెరికా... తాజాగా అందుకు బలమైన సాక్షాలు ఉన్నాయంటూ ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ భద్రతా సలహాదారు టామ్ బాసొర్టే పేరిట వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరిగిందని బాసొర్టే తెలిపారు.

దాడికి వెనుక ఉన్న సూత్రధారులను తాము దర్యాప్తులో గుర్తించామని బాసొర్టే వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా ఉత్తర కొరియా చర్యలు ఏమాత్రం బాగోలేవని... కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తోటి దేశాలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే వాన్నాక్రై ద్వారా దాడికి తెగబడిందని చెప్పారు. అయితే, ఈ ఆరోపణలపై ఉత్తర కొరియా ప్రభుత్వం కానీ, కిమ్ జాంగ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. 

  • Loading...

More Telugu News