jayalalitha: జయలలితది ఒరిజినల్ వీడియో కాదు.. మార్ఫింగ్: మండిపడ్డ అన్నాడీఎంకే

  • మార్ఫింగ్ చేసిన వీడియోను విడుదల చేశారు
  • ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే ఈ పని చేశారు
  • ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముందు రోజు వీడియో విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో, ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో దినకరన్ వర్గీయులు ఆసుపత్రిలో జయలలిత చికిత్ప పొందుతున్నప్పటి ఒక వీడియోను విడుదల చేశారు. జయకు మెరుగైన చికిత్స అందించామని తెలియజేసే క్రమంలో ఈ వీడియోను వ్యూహాత్మకంగా బయటపెట్టారు.  జయలలిత మరణానికి శశికళే కారణమంటూ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఉప ఎన్నికలో సానుభూతి ద్వారా ఓట్లను సాధించేందుకు ఎత్తుగడ వేశారని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఈ వీడియోపై ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది జయలలిత కాదని, ఇది మార్ఫింగ్ వీడియో అని ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత కానీ, ఈ ఏడాది కాలంగా కానీ బయటపెట్టని వీడియోను, ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న జయను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని... చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు కూడా ఆమెను చూపించలేదని చెప్పారు.

 ఈ నేపథ్యంలో ఈ వీడియోపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇది ముమ్మాటికీ మార్ఫింగ్ వీడియోనే అని తెలిపారు. ఎలక్షన్ నేపథ్యంలోనే, ఇలాంటి వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News