Revanth Reddy: రేవంత్ రెడ్డి కూడా స్టార్ట్ చేశారు: దర్శకుడు మధుర శ్రీధర్
- కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ప్రారంభించారు
- మోదీని విమర్శిస్తే ప్రమోషన్ తొందరగా వస్తుంది
- 2019 నాటికి దేశమంతా ఈ ట్రెండ్ విస్తరిస్తుంది
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రచారశైలిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మోదీపై విరుచుకుపడుతున్నారు. గెలుపు కోసం మోదీ దిగజారిపోయారని, అబద్ధాలను ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా నిన్న మోదీపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. "కాంగ్రెస్ పార్టీలో తొందరగా ప్రమోషన్ సాధించేందుకు మోదీని విమర్శించడాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను రేవంత్ స్టార్ట్ చేశారు. బహుశా ఇదే ట్రెండ్ 2019 నాటికి దేశమంతా వ్యాపిస్తుంది" అంటూ పేర్కొన్నారు.
Revanth Reddy also started this tactic of abusing Mr. Modi and get quick promotion in Congress because he is a rookie in congress style of politics. This trend will catch up across India for 2019 elections. #CongressMarkPolitics https://t.co/ImWKK92Si3
— Madhura Sreedhar Reddy (@madhurasreedhar) December 20, 2017