Heartbreaking image: నీళ్లులేక రోడ్డుపై బురద నీటిని తాగుతోన్న చిన్నారి.. ప్రపంచ వ్యాప్తంగా ఫొటో వైరల్!
- అర్జెంటీనాలోని పొసడాస్ సిటీలో ఘటన
- అక్కడి జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన యూనిసెఫ్ వాలంటీర్
- మేబా గరానీ తెగకు చెందిన చిన్నారులు ప్రతిరోజూ భిక్షాటన
- తాగేందుకు కూడా నీళ్లులేని వైనం
అర్జెంటీనాలోని పొసడాస్ సిటీలో ప్రజల జీవితం ఎంతటి దుర్భరంగా ఉందో తెలుపుతూ వెలుగులోకి వచ్చిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆకలి బాధే కాకుండా తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో ఓ చిన్నారి రోడ్డుపై నిలిచిన మురికి నీటిని తాగుతోంది.
ఆ సిటీలోని ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) వాలంటీర్ ఈ ఫొటోను వెలుగులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో మేబా గరానీ తెగకు చెందిన వందలాది మంది చిన్నారులు ప్రతి రోజు భిక్షాటన చేస్తున్నారని, రోడ్డుపై నిలిచే మురికి నీటినే తాగుతున్నారని చెప్పారు. ఈ ప్రాంత పిల్లల పరిస్థితులను చూస్తోంటే తమ గుండె బాధతో బరువెక్కుతోందని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.