Virat Kohli: బ్రాండ్ విలువలో దూసుకుపోతున్న కోహ్లీ.. షారూక్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా సారథి!

  • బ్రాండ్ విలువలో తొలిసారి షారూక్ వెనక్కి
  • 56 శాతం పెరిగి రూ.921 కోట్లకు చేరుకున్న కోహ్లీ బ్రాండ్ విలువ
  • మహిళల టాప్-15లో పీవీ సింధుకు చోటు

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ రోజురోజుకు పెరుగుతోంది. దేశంలోనే అత్యంత విలువైన సెలెబ్రిటీ బ్రాండ్‌గా విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్‌ను వెనక్కి నెట్టేశాడు. గతేడాదితో పోలిస్తే కోహ్లీ బ్రాండ్ విలువ ఏకంగా 56 శాతం పెరిగి రూ.921 కోట్లకు పైగా చేరుకుంది.

మైదానంలో కోహ్లీ అద్భుత ప్రదర్శనకు తోడు ఎండార్స్‌మెంట్లకు తీసుకునే మొత్తం పెరగడంతో అతడి బ్రాండ్ విలువ అమాంతం పెరిగినట్టు డఫ్ అండ్ ఫెల్ప్స్ నివేదిక తెలిపింది. అక్టోబరు నాటికి కోహ్లీ 20, షారూక్ 21 బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. డఫ్ అండ్ ఫెల్ప్స్ ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాక షారూక్ తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రూ.678  కోట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

93 మిలియన్ డాలర్లతో దీపిక పదుకొనే, 47 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్, 42 మిలియన్ డాలర్లతో రణ్‌వీర్ సింగ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి 15 మంది మహిళా సెలెబ్రిటీలలో స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి చోటు సంపాదించింది. రూ.96 కోట్ల బ్రాండ్ విలువతో 15వ స్థానంలో నిలిచింది. పురుషుల టాప్-15లో రూ.134 బ్రాండ్ విలువతో ధోనీ 13వ స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News