kanimozhi: 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో నేడే తీర్పు: తేలిపోనున్న కనిమొళి, రాజాల భవితవ్యం!
- 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో నేడే తీర్పు
- ఉత్కంఠలో డీఎంకే నేతలు
- ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం
డీఎంకే నేతలకు గత కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రెండక్షరాలు '2జీ'. పదేళ్లనాటి ఈ రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో కరుణానిధి ముద్దులపట్టి కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి రాజా కీలక నిందితులుగా ఉండటమే దీనికి కారణం. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.
దీంతో, కొన్ని గంటల్లో వీరు జైలుకు వెళతారా? లేక నిర్దోషులుగా ఇంటికి వెళతారా? అనే సస్పెన్స్ కు తెరపడనుంది. కాసేపటి క్రితమే వీరిద్దరూ పటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. మరోవైపు, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఈరోజే జరుగుతోంది. ఈ నేపథ్యంలో, డీఎంకేకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే, దాని ప్రభావం పోలింగ్ సరళిపై పడే అవకాశం కూడా ఉంది.