anna hazare: 2జీ కేసులో కోర్టు తీర్పు సరైనదే: అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
- కోర్టు తీర్పులను గౌరవించాలి
- కోర్టులకు సరైన సాక్ష్యాలు కావాలి
- సరైన సాక్ష్యాలు ఉంటే పై కోర్టుకు వెళ్లవచ్చు
2జీ స్కాం కేసును కొట్టేసిన పటియాలా హౌస్ కోర్టు... కనిమొళి, రాజాలతో పాటు మరో 15 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక పోరాట నేత అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు సరైన తీర్పును వెలువరించిందని ఆయన స్పష్టం చేశారు.
కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించినా... మనందరం శిరసా వహించాల్సిందేనని చెప్పారు. కోర్టు తీర్పును ప్రశ్నించడం సరికాదని అన్నారు. కోర్టులు సరైన సాక్ష్యాలనే చూస్తాయని... నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే కోర్టులు ఏమీ చేయలేవని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు ఉంటే... ఉన్నత న్యాయ స్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు.