obscene: అశ్లీల సన్నివేశాలు లేని కండోమ్ ప్రకటనలకు ఊరట
- ఎప్పుడైనా ప్రసారం చేసుకోవచ్చని ఆదేశం
- పాత ఆదేశాల్లో స్వల్ప మార్పులు
- రాజస్థాన్ హైక్టోరుకి స్పష్టతనిచ్చిన సమాచార శాఖ
ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల మధ్య కండోమ్ ప్రకటనలను ప్రసారం చేయకూడదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు సమాచార ప్రసారాల శాఖ స్వల్ప మార్పులు చేసింది. ఈ కొత్త ఆదేశాల ప్రకారం అశ్లీల సన్నివేశాలు లేని కండోమ్ ప్రకటనలను ఏ సమయంలోనైనా ప్రసారం చేసుకోవచ్చని వెల్లడించింది.
పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నెపంతో డిసెంబర్ 11వ తేదీన సమాచార ప్రసారాల శాఖ కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిబంధనలు విధించింది. ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ హైకోర్టు వివరణ కోరింది. ఆ వివరణలో భాగంగా అశ్లీల సన్నివేశాలు, మహిళలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు లేని కండోమ్ ప్రకటనలకు మినహాయింపు కల్పించినట్లు పేర్కొంది.