economy: 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత ఆర్థిక వ్యవస్థ
- వెల్లడించిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్
- పెరగనున్న సగటు తలసరి ఆదాయం
- విపరీతంగా పెరగనున్న ఉద్యోగాలు
భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే విభిన్నమైన దేశమని, ఆర్థిక పరంగా 2030 నాటికి 6.5 నుంచి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ వెల్లడించారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే 2035-40 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఆదాయం పెరగడంతో పాటు తలసరి ఆదాయంలో కూడా గణనీయ పెరుగుదల ఉంటుందని బిబేక్ చెప్పారు. 2030 నాటికి జాతీయ సగటు తలసరి ఆదాయం 4 వేల డాలర్ల వరకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో దేశీయ పాత్ర పెరగడం వల్ల ప్రభుత్వోద్యోగాల కోసం ఎవరూ ఎదురుచూడటం లేదని బిబేక్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగి యువతకు సులభంగా ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.