ajith: అజిత్ నెక్స్ట్ మూవీ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది
- అజిత్ న్యూ మూవీకి సన్నాహాలు
- శివ దర్శకత్వంలో నాల్గొవ సినిమా
- గతంలో చేసిన మూడు సినిమాలు హిట్
- తాజా ప్రాజెక్టు జనవరి 19న మొదలు
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడతారు. అందువలన ఆయన సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తూ .. వరుస విజయాలను అందుకుంటున్నాయి. శివ దర్శకత్వంలో వరుసగా ఆయన చేసిన 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేగం' సినిమాలు, రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి.
దాంతో మళ్లీ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఈ కాంబినేషన్ పై అందరిలోను ఆసక్తి మొదలవుతోంది. టైటిల్ విషయంలో 'వి' అక్షరం సెంటిమెంట్ ను పాటిస్తూ ఈ సినిమాకి 'విశ్వాసం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. జనవరి 19వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, 'యువన్' శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.