birmingham: బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్
- ప్రకటించిన కామన్వెల్త్ ఫెడరేషన్
- నిజానికి డర్బన్ లో జరగాల్సిన గేమ్స్
- ఆర్థిక సమస్యల దృష్ట్యా తప్పుకున్న డర్బన్
2022 కామన్వెల్త్ గేమ్స్‌కి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం ఆతిథ్యమివ్వనుంది. క్లిష్టమైన వేలం పాట తర్వాత బర్మింగ్‌హామ్‌ను ఆతిథ్య దేశంగా నిర్ణయిస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయి మార్టిన్ ప్రకటించారు. నిజానికి 2022 కామన్వెల్త్ గేమ్స్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరగాల్సి ఉంది. కానీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆతిథ్యం ఇవ్వలేమంటూ డర్బన్ తప్పుకోవడంతో మరోసారి వేలంపాట నిర్వహించాల్సి వచ్చింది.
ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం కోసం నిర్వహించిన వేలంలో బర్మింగ్‌హామ్, లివర్‌పూల్ నగరాల మధ్య గట్టిపోటీ నెలకొంది. అయితే చివరికి బర్మింగ్‌హామ్‌కి ఆతిథ్య బాధత్యలను కామన్వెల్త్ ఫెడరేషన్ కట్టబెట్టింది. నాలుగేళ్లకు ఒకసారి బ్రిటీష్ కామన్వెల్త్ దేశాల మధ్య ఈ పోటీలు జరుగుతాయి. చివరిసారిగా 2014లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్లాస్గోలో జరిగాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలో గోల్డ్‌కోస్ట్‌లో జరగనున్నాయి.