brexit: బ్రెగ్జిట్ త‌ర్వాత యునైటెడ్ కింగ్‌డ‌మ్ పాస్‌పోర్ట్ రంగులో మార్పు

  • బుర్గుండి రంగు నుంచి నీలి రంగులోకి
  • యురోపియ‌న్ యూనియ‌న్ ప‌దాల తొల‌గింపు
  • న‌క‌లు చేయ‌డానికి వీలు లేకుండా క‌ట్టుదిట్టం

యురోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిట‌న్ బ‌య‌టికి వ‌చ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత త‌మకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికీ ఓ వైపు బ్రెగ్జిట్ మీద చ‌ర్చోప‌చర్చ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు బ్రెగ్జిట్ అనంత‌రం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప‌నులు ముమ్మ‌రం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మ దేశ పాస్‌పోర్టు రంగును మార్చే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు బుర్గుండీ రంగులో ఉన్న పాస్‌పోర్టు రంగును నీలి, బంగారు రంగులోకి మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే పాస్‌పోర్టు మీద ఉండే 'యూరోపియ‌న్ యూనియ‌న్‌' అనే అక్ష‌రాల‌ను కూడా తొల‌గించ‌నున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త పాస్‌పోర్టును న‌క‌లు చేయ‌డానికి వీలు లేకుండా సాంకేతికత ఉప‌యోగించి అత్యంత క‌ట్టుదిట్టంగా త‌యారు చేయ‌నున్న‌ట్లు వారు చెప్పారు. యురోపియ‌న్ యూనియ‌న్‌లో చేర‌కముందు బ్రిటన్ పాస్‌పోర్ట్ నీలి రంగులోనే ఉండేది.

  • Loading...

More Telugu News