India: సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ.. 35 బంతుల్లోనే శతకం..రికార్డు!
- శ్రీలంక, భారత్ రెండో టీ20
- 8 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో రోహిత్ శర్మ 101 పరుగులు
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 149 (12 ఓవర్లకి)
- టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సమం
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోన్న శ్రీలంక, భారత్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసిన రోహిత్ శర్మ.. మరో 12 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కేవలం 35 బంతుల్లో మెరుపు వేగంతో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 101 పరుగులు చేయడంతో స్టేడియం అంతా 'రోహిత్.. రోహిత్' అనే నినాదాలతో మార్మోగిపోయింది.
ఇంతవరకు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లకి 149గా ఉంది. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు.