Pakistan: మిత్ర దేశంతో వ్యవహరించే తీరు ఇదేనా?: అమెరికాపై మండిపడ్డ పాకిస్థాన్
- ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో పాక్
- నోటీసులో పాక్ పేరును ఉంచిన ట్రంప్
- అమెరికా తీరును తప్పుబట్టిన పాకిస్థాన్
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును తమ అధ్యక్షుడు ట్రంప్ నోటీసులో ఉంచారంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపిన సంగతి తెలిపిందే. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపకపోతే, పాక్ కు అందిస్తున్న తాయిలాలు కూడా ఆగిపోతాయని ఆయన హెచ్చరించారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలను చేపట్టినా చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అమెరికాపై పాకిస్థాన్ మండిపడింది. మిత్రులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్ర దేశాలు ఒకరి పేరును మరొకరు నోటీసులో ఉంచడం భావ్యం కాదని... ఇదే సమయంలో శాంతిపై దృష్టిసారించాలని తెలిపింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య బంధాలను బలహీనం చేస్తాయని చెప్పింది.