rohit vemula: రోహిత్ వేముల దళితుడు కాదు... స్పష్టం చేసిన గుంటూరు జిల్లాయంత్రాంగం
- తెలంగాణ పోలీసులకు నివేదిక
- ప్రభుత్వానికి పంపిన పోలీసులు
- వెల్లడించిన పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య
హైదరాబాద్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల దళిత వర్గానికి చెందిన వాడు కాదని గుంటూరు జిల్లా రెవిన్యూ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను తెలంగాణ పోలీసులకు సమర్పించారు. తమకు అందిన నివేదిక, ప్రభుత్వానికి పంపించామని, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.
సంచలనం సృష్టించిన రోహిత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా అతని సామాజిక వర్గం గురించి తెలుసుకోవడానికి రోహిత్ జన్మించిన గుంటూరు జిల్లా యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించారు. పీహెచ్డీ చేస్తున్న రోహిత్‌ను కళాశాల నుంచి సస్పెండ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.