Pawan Kalyan: అదే జరిగితే.. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు: పవన్ కల్యాణ్
- అన్యాయం జరిగినప్పుడు అధికారులు ప్రేక్షకపాత్ర వహించరాదు
- దళిత మహిళకు కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలి
- సెన్సేషన్ కోసం మీడియా పాకులాడరాదు
విశాఖపట్నం పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడికి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని... నిస్సహాయ మహిళకు అండగా నిలబడాలని విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నానని ఆయన అన్నారు. అభాగ్యురాలికి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.
రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు ఏ ఒక్క వ్యక్తి కాని, ఏ ఒక్క వర్గం కానీ భంగం కలిగిస్తే... అలాంటివారిని అధికారులు క్షమించరాదని అన్నారు. ఒకవేళ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తే... చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. సెన్సేషన్ కోసం మీడియా పాకులాడరాదని... బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని కోరారు.