crypto currency: ఫేస్‌బుక్ మెసెంజర్‌కి మాల్‌వేర్ బెడద.. త్వరితగతిన వ్యాపిస్తున్న వైరస్
- వీడియో ఫైల్ ద్వారా వ్యాప్తి
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్‌వేర్‌గా గుర్తింపు
- ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాపించిన వైరస్
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో video_xxxx.zip అనే ఫైల్ కనిపిస్తే, తొందరపడి ఓపెన్ చేసేయకండి. ఇదొక మాల్‌వేర్. ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా కంప్యూటర్లలోకి ఈ వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది. 'డిగ్‌మైన్'గా పిలుస్తున్న ఈ వైరస్‌ను క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్‌వేర్‌గా సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఫోన్లో లేదా కంప్యూటర్లలో ఓపెన్ చేసిన వివిధ వెబ్‌సైట్లకు వ్యాపించి ఈ వైరస్ తప్పుడు క్రిప్టోకరెన్సీని సృష్టిస్తుంది. దీని వల్ల మిగతా ప్రోగ్రామ్స్ నత్తనడకన సాగుతాయి.
ఒకవేళ పొరపాటున ఈ ఫైల్‌ను ఓపెన్ చేసినట్లైతే, తాము అందిస్తున్న ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ద్వారా స్కాన్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఇప్పటికే ఈ వైరస్ దక్షిణ కొరియా, వియత్నాం, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వెనెజులా దేశాల్లో వ్యాప్తి చెందిందని, త్వరలో మిగిలిన దేశాలకు విస్తరించే అవకాశం ఉందని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.