lalu prasad yadav: 15 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు.. జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురు నిర్దోషులు.. జనవరి 3న శిక్ష ఖరారు!
- దాణా కొనుగోళ్ల కోసం అంటూ అక్రమంగా రూ.89 లక్షలు విత్‌డ్రా కేసులో తీర్పు
- నిర్దోషులుగా తేలిన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా
- సీబీఐ కోర్టు పరిసరాల్లో భారీగా బందోబస్తు
దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడిస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో లాలూ సహా మొత్తం 15 మందిని దోషులుగా తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని నిర్దోషులుగా తేల్చి చెప్పింది. నిర్దోషులుగా తేలిన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ సహా దోషులుగా తేలిన వారికి వచ్చేనెల 3న శిక్షను ఖరారు చేయనున్నారు.
కాగా, సీబీఐ కోర్టు ప్రాంగణానికి భారీగా లాలూ అనుచరులు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించారు. 1990-97 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కొనుగోళ్ల కోసం అంటూ అక్రమంగా రూ.89 లక్షలు విత్‌డ్రా చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది.