lalu prasad yadav: కస్టడీలోకి లాలూ ప్రసాద్ యాదవ్.. సెంట్రల్ జైలుకి తరలిస్తోన్న పోలీసులు!
- దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన దాణా కుంభకోణం కేసు
- 15 మంది దోషులు జైలుకి తరలింపు
- కట్టుదిట్టమైన భద్రత
దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా 15 మందిని రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. కేసులో తీర్పును వెల్లడించిన అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. లాలూతో పాటు 15 మంది దోషులను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకి తరలిస్తున్నారు. వారిని బిర్సా మండా సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్లు తెలిసింది. లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలడంతో ఈ ప్రభావం ఆయన కుమారుల రాజకీయ భవిష్యత్తుపై కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.