Hyderabad: అత్యుత్సాహం వద్దు.. హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించిన పోలీసులు
- కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు
- పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ప్రత్యేక ఈవెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి
- మద్యం తాగిన వారికి డ్రైవర్, క్యాబ్‌ల సదుపాయాన్ని నిర్వాహకులే కల్పించాలి
- డ్రగ్స్ పై ప్రత్యేకంగా నిఘా
డిసెంబర్ 31 అర్ధరాత్రి ... కొత్త సంవత్సర ఆగమనాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు అనగానే గుర్తుకు వచ్చేది కుర్రాళ్ల జోరు, రోడ్లపై వారు చేసే శ్రుతి మించిన పనులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అత్యుత్సాహంతో ఎటువంటి చర్యలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ వీవీ శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మద్యం తాగిన వారికి డ్రైవర్, క్యాబ్‌ల సదుపాయాన్ని నిర్వాహకులే కల్పించాలని చెప్పారు. కాగా, నూతన సంవత్స వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి పలు ముఠాలు డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని తెలిపారు.