Luis Fonsi: 450 కోట్ల క్లిక్స్ సాధించిన పాట!
- అధికమంది చూసిన పాటగా స్పానిష్ ఆల్బమ్ ‘డిస్పసీటో’
- ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది
- ఇంకా కొనసాగుతోన్న జోరు
ఈ ఏడాది అధికమంది చూసిన పాటగా స్పానిష్ ఆల్బమ్ ‘డిస్పసీటో’ నిలిచింది. నెమ్మది అనే అర్థం వచ్చే ‘డిస్పసీటో’ యూ ట్యూబ్‌లో ఎవ్వరూ ఊహించనన్ని క్లిక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మాత్రమే కాకుండా యూట్యూబ్ చరిత్రలోనే అధిక క్లిక్స్ పొందిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ ఆల్బమ్ ఇప్పటికే 450 కోట్ల హిట్స్‌ను దాటేసి ఇంకా దూసుకుపోతోంది. ఈ పాటకు 24 మిలియన్ల మంది లైక్ కొట్టారంటే దీని జోరు ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరూ చూడండి....