Madapur: యోగిని డీసీపీ కొడుతున్న వీడియోను ఎవరు రికార్డు చేశారో తేలుస్తాం: మాదాపూర్ ఇన్ చార్జ్ డీసీపీ విశ్వప్రసాద్

  • వైరల్ అయిన వీడియోపై విచారణ మొదలు
  • బాధ్యతలు మాదాపూర్ ఇన్ చార్జ్ డీసీపీ విశ్వప్రసాద్ కు అప్పగింత
  • ఇదే నిజమైతే తప్పుడు సంకేతాలు పంపుతున్నట్టే
  • స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు విఘాతమన్న విశ్వప్రసాద్

మాదాపూర్ డీసీపీ గంగిరెడ్డి, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగేష్ కుమార్ ను కాలితో తన్నుతున్నట్టు, చెంపలు వాయిస్తున్నట్టు వైరల్ అవుతున్న వీడియోపై పోలీసు శాఖ, విచారణకు ఆదేశించింది. కేసును విచారించి నివేదిక ఇవ్వాలని మాదాపూర్ ఇన్ చార్జ్ డీసీపీ విశ్వప్రసాద్ ను ఆదేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైరల్ అవుతున్న వీడియోలో నిజానిజాలు తెలియాల్సి వుందని అన్నారు. ఈ ఘటన డీసీపీ కార్యాలయంలో జరిగిందా? లేక మరెక్కడైనా జరిగిందా? అన్న విషయాలు తెలియాల్సి వుందని, దీన్ని ఎవరు చిత్రీకరించారో కూడా విచారిస్తున్నామని అన్నారు.

యోగితో పాటు వచ్చిన వ్యక్తి వీడియో తీశాడా? లేక హారికతో పాటు ఉన్న వ్యక్తి తీశాడా? అన్న విషయం తేలాల్సి ఉందని చెప్పారు. యోగిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని విశ్వప్రసాద్ తెలిపారు. వీడియో నిజమే అయితే, అది మంచి సంఘటన కాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని, స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు విఘాతమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News