Kurnool: చెన్నంపల్లి కోటలో తవ్వకాలు... నాటి పాలకుల ఖడ్గాలు లభ్యం!
- నిధి కోసం 12వ రోజు కొనసాగుతున్న తవ్వకాలు
- తాజాగా బయటపడిన పిడిబాకులు, శిల్పం
- మళ్లీ స్కానింగ్ చేయనున్నామన్న అధికారులు
కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచి ఉంచారని భావిస్తున్న నిధి కోసం పురావస్తు, మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న తవ్వకాలు 12వ రోజుకు చేరాయి. ఇప్పటివరకూ కొన్ని ఆస్థి పంజరాలు, ఏనుగు దంతాలు లభ్యం కాగా, తాజాగా రాజులు వాడిన ఖడ్గాలు, పిడిబాకులు, ఓ శిల్పం లభ్యమయ్యాయి.
గతంలో స్కానింగ్ లో కనిపించిన మెటల్ ఇప్పుడు బయటపడ్డ ఇనుప ఖడ్గాలకు సంబంధించినదేనని గుర్తించినట్టు మైనింగ్ అధికారులు చెప్పారు. మరోసారి కోటనంతటినీ స్కానింగ్ చేసేందుకు అధునాతన యంత్రాలను తెప్పించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తవ్వకాల ప్రక్రియను పూర్తిగా వీడియో తీస్తున్న అధికారులు, ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.