chiranjeevi: 'సైరా'లో నరసింహారెడ్డికి కుడి భుజంగా విజయ్ సేతుపతి!

  • 'సైరా'లో విజయ్ సేతుపతి
  • 'ఓబయ్య' పేరుతో కీలక పాత్ర
  • తెలుగులో మరిన్ని ముఖ్యమైన పాత్రలు చేసే ఛాన్స్

తమిళనాట యువ కథానాయకులతో పోటీపడుతూ విజయ్ సేతుపతి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయనతో నటించడానికి అగ్ర కథానాయికలు సైతం ఆసక్తిని చూపుతుంటారు. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. ఈ కారణంగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ విజయ్ సేతుపతి బిజీగా వున్నాడు. అంతే కాకుండా తెలుగులోను 'సైరా' సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

దాంతో ఆయన పాత్ర ఎలాంటిదై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే పాత్రలో కనిపించనున్నట్టు తాజా సమాచారం. పోరాట యోధుడైన నరసింహా రెడ్డికి అడుగడుగునా అండగా నిలిచేదిగా ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత తెలుగులోను ఆయన మరిన్ని కీలకమైన పాత్రలను చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరూ సరసన కథానాయికగా నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే.           

  • Loading...

More Telugu News