kalyani: 'హలో' హీరోయిన్ కి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు!
- 'హలో'తో ఆకట్టుకున్న కల్యాణి
- యూత్ మనసుల్లో చోటు
- ఆమె పైనే దర్శక నిర్మాతల దృష్టి
అఖిల్ హీరోగా ఈ నెల 22వ తేదీన 'హలో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో అఖిల్ సరసన మెరిసిన ఈ అమ్మాయికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అంతా "కల్యాణి.. ఐ హేట్ యూ" అంటూ వరుసగా మెసేజ్ లు పెట్టేస్తున్నారట.
ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం 'ఐ లవ్ యూ' అంటే .. ఎవరెస్టు అంత ప్రేమ .. 'ఐ హేట్ యూ' అంటే ఆకాశమంత ప్రేమ. ఎవరెస్టుకి ఒక పరిధి అనేది వుంది .. కానీ ఆకాశానికి లేదు. అందువలన ఈ సినిమా కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకుని అంతా ఆమెకి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు చేస్తున్నారట. ఇక ఈ అమ్మాయికి పెరుగుతోన్న క్రేజ్ ను చూసిన దర్శక నిర్మాతలు .. తమ తరువాత సినిమాల్లో కథానాయికగా ఆమెను తీసుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారని తెలుస్తోంది. చూస్తుంటే 'హలో'తో కల్యాణి ఇక్కడ తన హవాను మొదలెట్టేలానే వుంది.